Wednesday, May 28, 2014

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది? రాజధాని ఎంపికని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

కోట్ల ప్రజానీక భయాందోళనలని లెక్క చేయకుండా, ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తూ, ఓట్లు సీట్ల కోసం, రాజధాని కూడా లేకుండా, ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న రాజధానిని ఒకే ప్రాంతానికి ధారాదత్తం చేసి, ఇంకో ప్రాంతానికి లోటు బడ్జెట్ తో చిప్ప చేతికి ఇచ్చి, ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేలా అరకొరగా చీల్చి పారేసి చేతులు దులుపుకొంది కాంగ్రెస్. దానికి తగిన మూల్యం చెల్లించింది. వచ్చే 20 సంవత్సరాలు ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు. కాంగ్రెస్ , కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని, దగాని అనుక్షణం గుర్తు తెచ్చేలా రాజధాని నిర్మాణం జరగాలి. 

రాజధానిగా రకరకాల పట్టణాలు ప్రచారం లోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా దొనకొండ, దర్శి, అద్దంకి, పొదిలి లాంటి ప్రదేశాలు అనువైనవని నా అభిప్రాయం. పునాదుల నుండి కడితే బాగుంటుంది. దాని వల్ల ప్రణాళికా బద్దంగా(చండీగడ్ లాగ) నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే రాజధానిలోనే అభివృద్ది మొత్తం కేంద్రీకరించకుండా కేవలం పరిపాలనకు మాత్రమె వాడుకుని సరి కొత్త చిన్న పట్టణం అయితే బాగుంటుంది. పై చెప్పిన ప్రాంతాలకి ఉన్న అనుకూలతలు:

1. మెట్ట ప్రాంతం కావడం. 
2. చిన్న పట్టణాలు కావడం తో అభివృద్ధికి అవకాశం. 
3. ప్రభుత్వానికి భూ సేకరణ భారం తగ్గుతుంది. అలాగే ప్రైవేటు వ్యక్తులు ఇళ్ళు కొనాలన్నా , వ్యాపారం ప్రారంభించాలన్నా అందుబాటులో ఉంటాయి. 
4. ఆంధ్ర ప్రదేశ్ కి దాదాపు మధ్యలో ఉండటం. 
5. రాజధాని దగ్గరలో ఉండటం వాళ్ళ ప్రకాశం జిల్లా మొత్తం అభివృద్ది చెందే అవకాశం. 
6. రేపు పొద్దున ఏ ఎదవా దోచుకోవడానికే మా పట్టణం కి వచ్చారు అనే ఆవకాశం లేకపోవడం. 
7. హైదరాబాద్ కి ఆక్సెస్ తక్కువగా ఉండటం ఒక అనుకూలం. లేదంటే సొంతగా ఎదిగే అవకాశాలు తగ్గుతాయి. కొత్త రాజధాని నుండి హైదరాబాద్ కి హై స్పీడ్ రోడ్ ప్రతిపాదన కూడా విరమించి అదే హై స్పీడ్ రహదారులని ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలని కలపడానికి, చిన్న రహదారులని విస్తరించడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. 

ఇక ఇప్పుడు రాజధాని కోసం పోటీ లో ఉన్న నగరాలని చూస్తె కొన్ని అనుకూలతలు ఉన్నాయి , ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతికూలతలని చూస్తె:

1. వైజాగ్ : ఇది ఇప్పటికే అభివృద్ది చెందిన పట్టణం. ఇప్పటికే పారిశ్రామికంగా, చలన చిత్ర పరిశ్రమ పరంగా, IT పరంగా కొంత ఇప్పటికే అభివృద్ది చెందింది. ఈ పట్టణాన్ని రాజధాని చేయడం వల్ల హైదరబాద్ విషయం లో చేసిన తప్పునే మళ్లీ చేసిన వారు అవుతాం. అలాగే ఇది రాయలసీమ ప్రాంతానికి కొంచెం దూరం కూడా. ఈ పట్టణం రాజధాని కాకపోయినా మంచి నాయకులు దీని మీద ద్రుష్టి పెడితే రాజదానికంటే బాగా అభివృద్ది చెందడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. 

2. గుంటూరు , విజయవాడ , ఏలూరు ప్రాంతం : ఇవి కోస్తాలో చాలా కీలకమైన ప్రదేశాలు. ఇంచు మించు అన్ని ప్రాంతాలకి అందుబాటు దూరం లో ఉన్నా రాజధాని అయితే విలువైన పంట భూములు కోల్పోవలసి వస్తుంది. అలాగే భూముల ధరలు కూడా ఎక్కువే. దాంతో చిన్న వ్యాపారస్తులు రావటానికి ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగే సామాన్య ప్రజానీకానికి ఇళ్ళు కొనాలన్నా, స్థలాలు కొనాలన్నా అందుబాటులో ధరలు అందుబాటులో ఉండవు. ఇంకో విషయం ఈ పట్టణాలన్నీ అంతో ఇంతో అభివృద్ది చెందినవే. రాజధాని కాకపోయినా భవిష్యత్తు లో అభివృద్ధికి అవకాశం ఉన్న నగరాలు. 

3. తిరుపతి : ఒక మూలగా ఉండటం ప్రతికూల అంశం. ఇప్పటికే తిరుపతి పెద్ద నగరం. దగ్గరలో పారిశ్రామికంగా కూడా అభివృద్ది చెంది ఉంది. దీనిని రాజధాని చేస్తే అడవుల్ని కొట్టేసి విస్తరించాల్సి వస్తుంది. జనాభా ఎక్కువ అయ్యే కొద్ది తిరుమల భద్రత, పవిత్రత కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పట్టణాన్ని ఇలా ఉంచి భక్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తే మంచిది. 

4: కర్నూల్ : ఇంతకుముందు రాజధానిని కోల్పోయిన నగరంగా రాజధానిని తిరిగి అడిగే హక్కు ఉంది అయితే ఒక మూలగా ఉండటం ఈ నగరానికి ప్రతికూలం.

రాజధాని ఎక్కడైతే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎందుకు?

5 comments:

  1. 1. రాజమండ్రి అయితే అనుకూలంగా ఉంటుంది. చారిత్రాత్మకమైన ఊరు. మరీ ఒక మూలకేమీ లేదు. అంత పెద్ద పట్టణం కాదు. చెన్నయ్-కొలకత్తా రైల్వే లైన్ మీద ఉన్న ముఖ్యమైన స్టేషన్ లలో ఒకటి. ఎయిర్ పోర్ట్ ఉంది. NH-5 నేషనల్ హైవే దగ్గర ఉంది. అందువల్ల రవాణా సౌకర్యాలు బాగా ఉండి అన్ని ప్రాంతాల వారికీ అందుబాటులో ఉన్న ఊరు. నీటి కోసం పక్కనే గోదావరి నది ఉంది. విద్యాభ్యాసానికి పేరు గాంచిన ఊరు; యూనివర్సిటీ కూడా ఉంది. భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద కంపెనీలు రాకుండా నిషేధించి, పరిపాలనా రాజధాని గా మాత్రమే తీర్చిదిద్దుకుంటే బాగుంటుంది.

    2. మచిలీపట్నం కూడా ఆలోచించవచ్చు. బ్రిటిష్ కాలంనుంచీ కృష్ణా జిల్లా పరిపాలనా కేంద్రం. పేరొందిన విద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ ఉన్నాయి. విజయవాడకి దగ్గరలో ఉంది, విజయవాడ అంత పెద్ద ఊరు కాదు. విజయవాడ నుంచీ నాన్-స్టాప్ ఎక్స్ ప్రెస్ బస్సులు తిరుగుతుంటాయి. తదితర ఊళ్ళకు కూడా మంచి బస్ సౌకర్యం ఉంది. (బంగాళాఖాతం) సముద్రానికి దగ్గరగా ఉంది. ఒకప్పుడు పోర్ట్ గా వెలిగిన చారిత్రాత్మకమైన ఊరు (మోడర్న్ పోర్ట్ గా అభివృద్ధి చెయ్యాలి). ఏనాటినుంచో రైల్వే టెర్మినస్ గా ఉంది; కాకపోతే విజయవాడ వరకు సింగిల్ ట్రాక్ గా ఉన్న లైన్ని డబల్ ట్రాక్ చెయ్యాలి. ఎయిర్ పోర్ట్ ఒకటి కట్టాల్సి ఉంటుంది. ఇవి సమకూర్చుకుని పరిశ్రమలు రాకుండా చూస్తే, పరిపాలనా రాజధానిగా అనుకూలమైన చిన్న పట్టణం.

    అయినా రాజధాని గురించి అంత తీవ్రంగా ఆలోచించ వలసిన అవసరం లేదులెండి. ఎట్లాగూ, విజయవాడ గుంటూరు మధ్యనో చుట్టుపక్కల్నో రాజధాని ఏర్పడుతుందనిపిస్తోంది, మెగాసిటీలా తయారయినప్పటికీ. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని బలమైన వర్గాలు రాజధానిని వేరే చోటికి పోనిస్తారా?

    ReplyDelete
  2. రాజధాని వెనుకబడిన సీమ జిల్లాలకి దగ్గరగా ఉంటె మేలని నా అభిప్రాయం. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా వెనకబడ్డా, వైజాగ్ నగరం అందుబాటులో ఉంది. రాజమండ్రి, మచిలీపట్నం సీమ జిల్లాలకి దూరం మరియు అది అన్ని అభివృద్ది చెందిన ప్రాంతం (ముఖ్యంగా విద్య, వ్యవసాయ రంగాల్లో). అందుకే మధ్యే మార్గంగా ప్రకాశం జిల్లలో అయితే మంచిది. ఇక రాజధాని అనగానే ఏ సౌకర్యాలూ లేకపోయినా 5 నుండి 10 ఏళ్ళలో అన్నీ వస్తాయి. ఉదాహరణకి ఒక విమానాశ్రయం. ప్రజల కోసం కాకపోయినా నాయకుల కోసం, రాజధాని స్టేటస్ కోసం అయినా కడతారు. ప్రకాశం జిల్లలో అయితే అన్ని జిల్లాల వాళ్ళూ ఇక్కడికే రావడానికి అవకాశం ఉంది లేదంటే ప్రభుత్వేతర పనులకి కర్నూల్ వాళ్ళు హైదరాబాద్ కి , చిత్తూరు వాళ్లు చెన్నై కి , అనంతపురం వాళ్ళు బెంగళూరు కి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు.

    మీరు అన్నది నిజమే విజయవాడ చుట్టు పక్కల ఉన్న బలమైన వర్గం ఎన్ని ప్రతికూలతలు ఉన్నా అక్కడే రాజధాని పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటికైనా స్వార్థం వదిలి మొత్తం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

    ReplyDelete
  3. గుడూరు అయ్యితె బగుంతుంది అని భవిస్తున్నా. ఏందుకంటే ...

    - ఇక్కడ భుముల రెట్లు తక్కువ. సేకరించడం సులభం.
    - తిరుపతి విమనాస్రయం ను ఇంటెర్నెనేషనల్ విమనాస్రయం మర్చుకుంటె .. కేంద్రానికి దగ్గర ఉంటుంధి .. ఇంటెర్నెనేషనల్ విమనాస్రయం డెవ్లొప్ అయ్యె వరకు ఛెన్నై విమనాస్రయం ధగ్గర్లొ అందుబటులొ ఉంటుంది .. హైద్రాబాద్ వైపు చుడక్కర్లెధు ..

    - గుడూరు Railway Junction మరియు నేషనల్ హై-వే ఉంధి. అన్ని ప్రంతల్ని కలుపుతుంధి. ఆన్ని ప్రంతలకు అందుబటులొ ఉంటుంది. నెల్లూరు దగ్గర పొర్ట్ డెవెలొప్ చెస్తే ఎగుమతులకి అనుకులం గ ఉంటుంది.

    -గుంటురు లేక విజయవాడ రాజధాని అయ్యితే .. తెలంగన రెండు జిల్లాల చిన్న వ్యాపారులకు అనుకూలంగ మారుతుంది..

    -గుంటురు, విజయవాడ లు ఎంతొ కొంత అభివ్రుధ్ది చెంధిన పట్టనాలె. అక్కడ యునివెర్సిటీస్లను డెవెలప్ చెస్తే మంచిది.

    ReplyDelete
  4. బాగుంది మాస్టారు మీ ఆలోచనలు, నా ఈ పోస్ట్ లో రాజదాని మద్యలోనే వుండాలి. అనే దానికి వివరణ ఇచ్చాను. బౌగోలికంగా చూస్తే ఒంగోలు లేక గుంటూరు సరిఅయిన ప్రాంతాలు, ఇప్పుడు ఎలాగు గుంటూరు అంటున్నారు. రాజదాని వరకూ అది సరే కానీ అభివృద్ధి కి కుడా ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవటం వలనా మీరు చెప్పినట్టు మూడు విధాలుగా నష్టపోతము ఎలాంటే ఒకటి అతి సారవంతం అయిన భూమిని కోల్పోతాము. రెండు భూమి ధరలు ఎక్కువ వుంటాం వలనా భూసేకరణ కష్టమవుతుంది. మూడు వ్యాపారాలు రారు కనుక అభివృద్ధి పూర్తిగా కుంటూ పడుతుంది. మన రాష్ట్రం బౌగోలికంగా చూస్తే నాలుగు అంతర్జాతీయ విమానశ్రాయల మద్యలో వుంది దానిని మనం వాడుకోవాలి. దేశంలోని ఏ ప్రాంతానికి ఇంత సౌకర్యా వంతంగా విమానశ్రాయలు లేవు. ఒక్క ఒంగోలుకి తప్పితే అన్ని ప్రాంతాలకి 250km లోపల ఒక అంతర్జాతీయ విమానశ్రాయం ఉంది. బెంగలూరు - అనంతపురం, కడప, చిత్తూరు చెన్నై- చిత్తూరు, నెల్లూరు, కడప వైజాగ్ - శ్రీకాకుళం, విజయనగరం, విశాకపట్టణం, తు.గో, ప.గో హైదరాబాద్ - కర్ణులు, క్రిష్ణ, గుంటూరు. అదే 300km తీసుకుంటే అన్ని ప్రాంతాలు కవరవుతాయి. ఎప్పుడూ క్రిష్ణ జిల్లా విమానశ్రాయం పెద్దది చేసే బదులు ఆల్రెడీ వున్న విశాక విమానశ్రాయం వాడు కొంటూ, కొంచం పెద్దది చేసి, ఒంగోలులో భూసేకరణ చేసి పెద్ద విమానశ్రాయం నిర్మించుకోవచ్చు. అది రాజదాని అయిన గుంటూరుకి దగ్గరగా వుంటుంది. పరిశ్రమలకి ఎంత భుముల రెట్లు తక్కువగా వుంటే అంత మంచిది. నిరు కూడా అవసరమే అల అని నిరు పుష్కలంగా వుండే క్రిష్ణ, గుంటూరు, తు.గో, ప.గో లను కదపటం మంచిది కాదు. క్రిష్ణ, గుంటూరు ప్రజలనూ రాజదాని పెట్టి త్రుప్తి పరచి, తు.గో, ప.గో లను కొన్ని విశ్వవిద్యాలయాలతో సరిపెట్టుకొమ్మని, విశాకని వున్న వాటితో, రైల్వే జాన్ అంట గట్టి, చిత్తురుకి వెంకటేస్వరుడిని ఇచ్చేసి మిగతా జిల్లాలని అభివృద్ధి చేసుకోవాలి. అల అని చెప్పిన జిల్లాలని వదిలేయమని కాదు అది కచ్చితంగా ఆ ప్రాంతంలో ఎకనమికాల్ గా అనిపిస్తేనే పెట్టాలి.
    http://pol-satbhogi.blogspot.in/2014/06/blog-post_9638.html

    ReplyDelete
    Replies
    1. సత్భోగి గారూ వ్యాఖ్యకి ధన్యవాదాలు. రాష్ట్ర విభజన జరిగినా మన వాళ్ళకి బుద్ది రాలేదు. మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి విజయవాడ-గుంటూరు, విశాఖ లలోనే పోస్తున్నారు. ఎప్పటికి నేర్చుకుంటారో? ఇదే అంశంపై మీ టపా చూసాను. మీ విశ్లేషణ బాగుంది.

      Delete

Comments