Sunday, May 25, 2014

మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సే ని పిలవటం పై మీ అభిప్రాయం

మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధ్యక్షులకి ఆహ్వానం పంపడం తెలిసిందే. ఈ విషయం పై తమిళనాడు రాజకీయ పార్టీలు, ప్రజలు రాజపక్సే కి ఆహ్వానం పంపడం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదొక సున్నితమైన అంశం.

స్థూలంగా LTTE ని పూర్తిగా మట్టుపెట్టినందుకు తమిళ ప్రజలకి రాజపక్సే అంటే ద్వేషం (పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువగా) . తమిళులు LTTE కి ఎన్నో విధాలుగా సాయం చేశారు ఈ విషయంలో. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు.  ఇది తప్పు. ఐతే  తమ వాళ్ళని ఊచకోత కోశారు అనే కోపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

శ్రీలంక కోణం నుండి చూస్తె శ్రీలంక లో ఉన్న తమిళులకి హక్కులు నిరాకరించటం తప్పు అయినా అది వారి దేశానికి సంబంధించిన విషయం. అక్కడికి తరలి వెళ్ళిన వారు హక్కులకోసం పోరాడవచ్చు, నిరసన తెలియజేయవచ్చు కానీ సాయుధ పోరాటం చేయటం ముమ్మాటికీ తప్పని నా అభిప్రాయం. అలాగే శ్రీలంక ప్రభుత్వం LTTE తో పాటు పిల్లలతో సహా ఎంతో మంది అమాయకులని మట్టు పెట్టింది. శ్రీలంక కోణంలో అది దేశ రక్షణ కోసం తీసుకున్న చర్య కావొచ్చు కానీ ఆ పేరుతో అమాయకుల ఊచకోత సహించరానిది. 

ఈ భావోద్వేగాల మధ్య నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాలలో ఒకటైన శ్రీలంకకి కూడా ఆహ్వానం పంపింది. తమిళ రాజకీయ పార్టీ లు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. నా దృష్టిలో రెండు వైపులా తప్పులు జరిగాయి. గతాన్ని మర్చిపోయి తోటి దేశాలతో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. అదే సమయం లో తమిళ ప్రజల భావోద్వేగాలని పరిగణన లోకి తీసుకుని వారికి భారత ప్రభుత్వం తన ఆలోచనలని వివరించి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాజపక్సేని ఆహ్వానించడాన్ని  మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ఎందుకు ?

4 comments:

  1. అరవ వాళ్లకి ఇష్టం లేదని శ్రీ లంకని, కంయునిస్ట్లు ఉన్నారని నేపాలును, అస్సాము వారికి ఇష్టం లేదని బంగ్లాదేశును, రానివ్వకపోతే...హిందువులకి ఇష్టంలేని పాకిస్తానుని రానియ్యవచ్చునా... ఇలా అనుకుంటూ పొతే ఇరుగుపొరుగు వారితో సంబంధాలు బలపడేది ఎలా... ఇప్పటికే మన దేశ దిక్కుమాలిన విదేశాంగ విధానం వలన చుట్టూ ప్రక్కల దేశాలతో శత్రుత్వం నెలకొన్నది. ఈ దేశాలని శత్రుత్వంతో కన్నా మిత్రత్వం తోనే కంట్రోల్ చెయ్యవచ్చును.

    ReplyDelete
  2. If there is nothing wrong inviting Pak president then there nothing wrong in Srilanka president.

    ReplyDelete
  3. శ్రీలంక తో మితృత్వంతోనే తమిళుల హక్కులను కాపాడుదాం..... శతృవుగా ఏ పని చేయలేం......

    ReplyDelete
  4. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

Comments